Home » New Delhi
దేశ రాజధాని ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. 5,000 మంది కాంట్రాక్టు వర్కర్ల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తున్నట్టు బుధవారంనాడు ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై అధిష్టానం కసరత్తు చేపట్టింది.
దేశరాజధాని ఢిల్లీలోని వైసీపీ పార్టీ రంగుల పిచ్చి వదలలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇది అధికారిక కార్యక్రమమా లేక వైసీపీ పార్టీ కార్యక్రమమా అన్న రీతిలో అక్కడి అలంకరణ ఉంది.
సమున్నత భారతదేశాన్ని సృష్టించాలనే ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేరీ మాతీ మేరా దేశ్- అమృత కలష్ యాత్ర' ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోదీ భారత కలష్‌లో ఉంచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ శాఖల్లోకి తీసుకున్న 51,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ప్రజలు కాలం చెల్లిన ఫోన్లను 2014లోనే బయట పడేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బీజేపీ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' ఈవెంట్లో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం తప్పుడు తడకలుగా సాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సేనలు ఆస్పత్రిపై బాంబులు వేస్తే ప్రధాని మోదీ సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సీఈసీ భేటీలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. 60 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా జరిగిన కసరత్తును ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. సీఈసీ ముందు పెట్టారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ గురువారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 256 పాయింట్లుగా రికార్డ్ అయి ఎయిర్ క్వాలిటీ పేలవంగా మారింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మళ్లీ "రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్" ప్రచారం ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఇంజిన్ ఆపేయాలని చెప్పడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం.